Cricket Australia | స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సమరం.. ఆస్ట్రేలియా సీనియర్లు వచ్చేశారు..!
Cricket Australia : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనుంది ఆసీస్. ఈ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) స్క్వాడ్‌ను ఎంపిక చేసింది.
Cricket Australia : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈసారి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనుంది ఆసీస్. ఈ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. ప్యాట్ కమిన్స్ సారథిగా 13 మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. కొన్ని రోజులుగా టెస్టులకు దూరమైన సీనియర్ పేసర్ హేజిల్‌వుడ్, సర్జరీ అనంతరం కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ నాథన్ లియన్ స్క్వాడ్‌లో ఉన్నారు.
డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. ఈ సిరీస్‌తో ఆ జట్టు సీనియర్లు పునరాగమనం చేయనున్నారు. గాయాల కారణంగా సుదీర్ఘ ఫార్మాట్‌కు దూరమైన కమిన్స్, హేజిల్‌వుడ్, లియన్ బంగ్లా సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారు. స్క్వాడ్ ఎంపిక అనంతరం చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి 13 మందితో స్క్వాడ్‌ను ఎంపిక చేశామని, అవసరాన్ని బట్టి మార్పులు చేస్తామని పేర్కొన్నాడు.
Introducing your Australian Men’s squad to take on Bangladesh up north next month 🌴 pic.twitter.com/UmoJr69o1A
— Cricket Australia (@CricketAus) July 21, 2026
‘టెస్టుల్లో కమిన్స్, హేజిల్‌వుడ్, లియన్ పునరామగనం కోసం జాతీయ సెలక్షన్ కమిటీ ఎదురుచూస్తోంది. కొన్ని నెలలుగా స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ బృందం సాయంతో గాయాల నుంచి కోలుకునేందుకు వారు ఎంతో కష్టపడ్డారు. పదమూడు మంది స్క్వాడ్‌కు అదనంగా అవసరమైతే ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. రాబోయే 12 నెలల్లో మూడు ఫార్మాట్లలో పలు మ్యాచ్‌లు ఉన్నందున.. మిగతా వారికి కూడా అవకాశం లభించనుంది’ అని బెయిలీ వెల్లడించాడు. బంగ్లాదేశ్ జట్టు 18 ఏండ్ల తర్వాత టెస్టుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్తోంది. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 26 వరకు ఇరుజట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, హేజిల్‌వుడ్, లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెథరాల్డ్, బమ్యూ వెబ్‌స్టెర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

