Sonam Raghuvanshi | లొంగిపోతావా.. బెయిల్ రద్దు చేయాలా.. సోనమ్ రఘువంశీకి రెండు ఆప్షన్లు ఇచ్చిన సుప్రీంకోర్టు
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది కోర్టు. ఒకటి తనకు తానుగా లొంగిపోవడం. రెండోది బెయిల్ రద్దు చేయడం.
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఆమె విషయంలో రెండు ఆప్షన్లు ఇచ్చింది కోర్టు. ఒకటి తనకు తానుగా లొంగిపోవడం. రెండోది బెయిల్ రద్దు చేయడం. ఈ రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోర్టు సూచించింది. మేఘాలయకు గత ఏడాది భర్త రాజా రఘువంశీని హనీమూన్ తీసుకెళ్లిన సోనమ్ రఘువంశీ.. అక్కడ అతడిని హత్య చేయించిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టైన సోనమ్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైంది. మొదట మేఘాలయ ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని ప్రభుత్వం సవాలు చేస్తూ మేఘాలయ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు కూడా ఆమె బెయిల్‌ను సమర్ధించింది. దీంతో సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలే ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. దీనిపై మంగళవారం సోనమ్ తరఫు న్యాయవాదికి కీలక సూచనలు చేసింది. రెండు ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి ప్రభుత్వం కోరుతున్నట్లు సోనమ్ బెయిల్ రద్దు చేయడం.
రెండోది.. ఆమె తనకుతానుగా కోర్టులో లొంగిపోయి, విచారణకు సహకరించడం. దీనిపై స్పందించిన సోనమ్ తరఫు న్యాయవాదులు ఈ అంశంపై సమాధానం చెప్పేందుకు గురువారం వరకు సమయం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఇదే సమయంలో అరెస్టు తర్వాత బెయిల్‌పై ఉన్న సోనమ్ ప్రవర్తన గురించి వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్‌గా తుషార్ మెమతా వ్యవహరిస్తున్నారు. సోనమ్ బెయిల్ రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. సోనమ్ తనకుతానుగా పోలీసుల ఎదుట లొంగిపోయిందని, అందువల్ల అరెస్టుకు సరైన కారణాలు లేవన్న సాకుతో బెయిల్ కావాలని ఆమె కోరలేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
అరెస్టు సమయంలో ఆమెకు జారీ చేసిన మెమోలో ఏదైనా లోపం ఉంటే, అది క్లరికల్ పొరపాటు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాజా రఘువంశీ కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

