అస్తానా: కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. టోర్నీలో హితేశ్ గులియా, సాక్షి.. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. గురువారం జరిగిన పురుషుల 70 కిలోల క్వార్టర్స్ బౌట్లో హితేశ్ 5-0 తేడాతో అల్మాజ్ ఒర్జోబెకెవ్(కజకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు.
మహిళల 54కిలోల క్వార్టర్స్‌లో సాక్షి.. బ్రెజిల్ బాక్సర్ తతియాన రెజినా డీ జీససస్ చాగస్పై అలవోక విజయం సాధించింది. టోర్నీ లో ఇప్పటికే మీనాక్షి (48కి), పూజారాణి (80కి), సంజు (60కి), అనామిక(51కి) పతకాలు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.