న్యూఢిల్లీ: హాకీ ( Hockey ).. మన దేశ జాతీయ క్రీడ. ఈ మాట చెప్పుకోవడానికే తప్ప ఎన్నడూ ఈ ఆటకు అంతటి ప్రాధాన్యత దక్కలేదు. గతమెంతో ఘనమైనా కొన్ని దశాబ్దాలుగా హాకీలో మన ఇండియన్ టీమ్ ఆట దారుణంగా పతనమవుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో 8 గోల్డ్ మెడల్స్ గెలిచిన చరిత్ర ఉన్నా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం అర్హత సాధించలేక చతికిలపడింది. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ అదే ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే స్థాయికి చేరింది. ఈ విజయంలో ఫీల్డ్‌లో ఆడిన ప్లేయర్స్‌కు ఎంత పాత్ర ఉందో తెర వెనుక అంతకంటే ఎక్కువ పాత్రే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోషించారు.
ఆపద్బాంధవుడు
ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ తెలుసు కదా. కాసులు కురిపించే ఈ ఆటను ప్రమోట్ చేయడానికి స్పాన్సర్లు కూడా క్యూ కడతారు. కొన్నేళ్లు ఇండియన్ టీమ్ ప్లేయర్స్ జెర్సీలపై తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి వందలు, వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ హాకీ పరిస్థితి వేరు. ఈ గేమ్‌ను స్పాన్సర్ చేయడానికి ఎవరూ అంత సులువుగా ముందుకు రారు. క్రికెట్‌తో పోలిస్తే హాకీకి ఇండియాలో ఏమాత్రం క్రేజ్ ఉండకపోవడమే దీనికి కారణం.
చాన్నాళ్లుగా ఇండియన్ హాకీ టీమ్ స్పాన్సర్‌గా సహారా కొనసాగింది. అయితే 2018లో టీమ్ స్పాన్సర్షిప్ నుంచి సహారా తప్పుకుంది. ఎవరూ టీమ్‌ను స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. ఇలాంటి సమయంలో ఒడిశాలోని నవీన్ పట్నాయక్ సర్కారు హాకీ ఇండియాను ఆదుకుంది. ఐదేళ్లకుగాను హాకీని స్పాన్సర్ చేయడానికి పట్నాయక్ ప్రభుత్వం రూ.100 కోట్లకు హాకీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే మళ్లీ ఇండియన్ హాకీ టీమ్ రాతను మార్చింది.
హాకీపై ఇష్టంతో..
నవీన్ పట్నాయక్ గతంలో హాకీ ప్లేయరే. ఆయన డూన్ స్కూల్లో చదువుతున్న సమయంలో హాకీ గోల్‌కీపర్‌గా ఉన్నారు. అందుకే ఆ ఆటపై ఉన్న ఇష్టంతోనే టీమ్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడానికి ఆయన ముందుకు వచ్చారు. పురుషుల జట్టుతోపాటు మహిళలూ జట్టుకూ ఐదేళ్ల పాటు స్పాన్సర్‌గా ఉండటానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది జరిగిన మూడేళ్లకు ఇప్పుడు ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ ఒలింపిక్స్ మెడల్ గెలిచింది. మహిళల టీమ్ కూడా మెడల్‌కు అడుగు దూరంలో ఉంది.
ఈ ఒలింపిక్స్‌లో ఇండియన్ టీమ్ ఆడిన పలు మ్యాచ్‌లను నవీన్ పట్నాయక్ చూశారు. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత కూడా టోక్యోలో ఉన్న టీమ్‌తో వీడియో కాల్లో మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి భారతీయుడికీ ఇది గర్వకారణమని నవీన్ పట్నాయక్ అన్నారు.
ఏడేళ్ల నుంచే..
2014లో ఒడిశా ప్రభుత్వం చాంపియన్స్ ట్రోఫీ హాకీకి ఆతిథ్యమిచ్చింది. అప్పుడే ఒడిశా స్పాన్సర్షిప్కు బీజం పడింది. ఆ టోర్నీపై నవీన్ పట్నాయక్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ తర్వాత 2017లో ఒడిశా ప్రభుత్వం స్పాన్సర్‌గా ఉన్న కలింగ లాన్సర్స్ టీమ్ హాకీ ఇండియా లీగ్‌ను గెలిచింది. ఇక 2018లో హాకీ వరల్డ్ లీగ్‌ను కూడా ఒడిశా నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ మెన్స్ సిరీస్ ఫైనల్స్, ఒలింపిక్ హాకీ క్వాలిఫయర్స్.. 2020లో ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ కూడా ఒడిశాలో జరిగాయి. ఇలా ఇండియన్ హాకీ వేసే ప్రతి అడుగులోనూ నవీన్ పట్నాయక్ తెర వెనుక హీరోగా ఉంటూ వస్తున్నారు.
#WATCH Odisha CM Naveen Patnaik spoke to Indian men's hockey team and congratulated them for winning the Bronze medal in match against Germany
— ANI (@ANI) August 5, 2021
"We are looking forward to receiving the Indian Olympic hockey team on 16th August in Bhubaneswar," he said#OlympicGames pic.twitter.com/vh7wVtdSzK
#WATCH The entire country is proud of the achievement of the Indian men's hockey team. In the last few days, Hockey has brought together every Indian across the globe. The performance of this team will inspire many: Odisha CM Naveen Patnaik pic.twitter.com/WVwhyQLoZA
— ANI (@ANI) August 5, 2021