హరారే: జింబాబ్వే మాజీ పేసర్ హెన్రీ ఒలాంగా పేరు గుర్తుండే ఉంటుంది. తన స్వింగ్ బౌలింగ్‌తో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఇబ్బంది పెట్టిన ఒలాంగా ఇప్పుడు కొత్త కెరీర్ ఎంచుకున్నాడు. తాజాగా ముగిసిన అడిలైడ్ టెస్టులో ఒలాంగా పెయింటర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
2003లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఒలాం గా..రచయితగా, సామాజిక కార్యకర్తగా, అంపైర్‌గా, కోచ్‌గా పాత్రలు పోషించి ఇప్పుడు పెయింటర్‌గా తన ప్రతిభ నిరూపించుకుంటున్నాడు. అడిలైడ్ టెస్టు సందర్భంగా పెయిటింగ్ చేస్తు న్న ఒలాంగాను గుర్తించిన కొందరు అభిమానులు ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.