WTC Final 2023 : టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తొలి రోజు రెండో సెషన్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. ఈ సెషన్లో ఒకే ఒక వికెట్ పడింది. లంచ్ తర్వాత మార్నస్ లబుషేన్(26)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్(60 నాటౌట్ : 75 బంతుల్లో 10 ఫోర్లు) అటాకింగ్ గేమ్ ఆడాడు. అతను శార్ధూల్ ఠాకూర్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు స్టీవ్ స్మిత్(33 నాటౌట్ : 102 బంతుల్లో 4 ఫోర్లు) క్రీజులో పాతుకుపోయాడు.
స్మిత్ స్టాండ్ ఇవ్వడంతో హెడ్ రెచ్చిపోయి ఆడాడు. సిరాజ్, ఉమేశ్ యాదవ్ సహా శార్ధూల్ బౌలింగ్లో బౌండరీలతో విరుచుకుపడ్డాయి. వీళ్లు ఇద్దరు నాలుగో వికెట్కు 94 పరుగులు జోడించారు. ఈ జోడీని విడదీసేందుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ జడేజాను దించాడు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో, టీ బ్రేక్ సమయానికి (51 ఓవర్లకు) ఆస్రేలియా స్కోర్.. 170/3.