బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌తో జరుగుతున్నతొలి టెస్టులో 159 రన్స్ తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా(Australia).. సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 301 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ కేవలం 141 రన్స్‌కే ఆలౌటైంది. ఆసీస్ స్పీడ్ బౌలర్ హేజిల్ వుడ్ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ కేవలం 33.4 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. వాస్తవానికి మూడో రోజు ఆట సమయం ముగిసినా.. మ్యాచ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గంటా 13 నిమిషాలు అదనంగా ఆడించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీలు కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ముగ్గురూ హాఫ్ సెంచరీలు చేసి ఔటయ్యారు.
Australia’s #WTC27 campaign off to a winning start in Barbados 🙌#WIvAUS scorecard 📝 https://t.co/tnfgrGNZE8 pic.twitter.com/ZrZGycrtLp
— ICC (@ICC) June 28, 2025