హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ షార్ట్కోర్స్ అంతరజిల్లాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో హవ్య అదరగొట్టింది. శనివారం జరిగిన టోర్నీ 400మీటర్ల ఫ్రీస్టయిల్, 100మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో హవ్య రన్నరప్‌గా నిలిచింది.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ రెండో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం బ్లూడాల్ఫిన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ యువ స్విమ్మర్ మాండ్య (కర్ణాటక)లో ఈ నెల 30 నుంచి జరిగే సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికై ప్రతిభ చాటింది.