కోల్‌కతా : హర్యానాతో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న రంజీ క్వార్టర్స్‌లో మాజీ చాంపియన్ ముంబై మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశపరిచినా ఆ తర్వాత ముంబై అద్భుతంగా పుంజుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 14 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న కెప్టెన్ అజింక్యా రహానే (88 బ్యాటింగ్), మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (70), శివమ్ దూబె (30 బ్యాటింగ్) రాణించడంతో ఆ జట్టు 292 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు శార్దూల్ విజృంభించడంతో హర్యానా మొదటి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకే (ముంబై 315) ఆలౌట్ అయింది.