IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ షాన్ మార్ష్(52) మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. హర్షిత్ రానా వేసిన 11వ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. ఇదే ఓవర్ రెండో బంతికి ఎడెన్ మర్క్రమ్(47) ఔటయ్యాడు. బౌండరీతో అర్ధ శతకానికి చేరువైన అతడు..పెద్ద షాట్‌కు పోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దాంతో, లక్నో 99 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మార్ష్‌కు అండగా నికోలస్ పూరన్(2) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లకు స్కోర్.. 106-1.
ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు షాన్ మార్ష్(52), ఎడెన్ మర్క్రమ్(47)లు శుభారంభం ఇచ్చారు. కోల్‌కతా బౌలింగ్ దళాన్ని చీల్చిచెండాడిన వీళ్లు పవర్ ప్లేలో 59 రన్స్ పిండుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు అజింక్య రహానే ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. అయితే.. 11వ ఓవర్లో హర్షిత్ రానా సూపర్ డెలివరీతో మర్క్రమ్ను బోల్డ్ చేసి కోల్‌కతాను బ్రేకిచ్చాడు.