న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 కోసం ఇవాళ ఆటగాళ్ల వేలం జరిగింది. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్.. రూ.13.25 కోట్లకు అమ్ముడుపోయాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకున్నది. మూడు ఫ్రాంచైజీలు అతన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి. ఇక మయాంక్ అగర్వాల్ ను 8.25 కోట్లకు సన్‌రైజర్స్ జట్టు సొంతం చేసుకున్నది. కేన్స్ విలియమ్సన్ ను రెండు కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
Brook-ing Bad with our first buy. 🔥
Harry Brook is a RISER. 🧡#BackToUppal #OrangeArmy #TATAIPLAuction pic.twitter.com/L8EW45zQvL
— SunRisers Hyderabad (@SunRisers) December 23, 2022
బ్రూక్ బంగారమాయనే..
హ్యారీ చెర్రింగ్టన్ బ్రూక్.. ఇంగ్లండ్ క్రికెటర్. యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు అతను ఆడుతాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అతను. మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు తరపున అంతర్జాతీయ కెరీర్‌ను అతను ప్రారంభించాడు. నిజానికి బ్రూక్ జాక్‌పాట్ కొట్టేశాడు. ఏ మాత్రం అంచనా లేని ప్లేయర్‌ను .. సన్‌రైజర్స్ జట్టు భారీ ధరకు ఖరీదు చేసింది. ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన సిరీస్‌లో ఆడిన బ్రూక్.. బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. టీ20ల్లో అతను 79 యావరేజ్‌తో స్కోరింగ్ చేశాడు.
What do you make of this buy folks? 💰💰
Congratulations to Harry Brook who joins @SunRisers #IPLAuction | @TataCompanies pic.twitter.com/iNSKtYuk2C
— IndianPremierLeague (@IPL) December 23, 2022