MIW vs GGW : ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే పోరులో గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠ విజయంతో కల సాకారం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(82 నాటౌట్) విధ్వంసంతో కంగారెత్తిపోయిన గుజరాత్ సంచలన ప్రదర్శనతో ముంబైకి చెక్ పెట్టింది. బౌండరీల మోతతో గుజరాత్ బౌలర్లను వణికించిన హర్మన్‌ప్రీత్ ఆఖరి ఓవర్లో 26 పరుగులు అసవసరమవ్వగా.. తొలి బంతికి సిక్సర్.. మూడో బంతిని ఆఫ్‌సైడ్‌లో సిక్సర్‌గా మలిచింది. అయితే.. నాలుగో బంతికి సింగిల్ రావడంతో హర్మన్‌ప్రీత్ నాన్స్ట్రయిక్కు పరిమితవ్వగా.. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ముంబైపై తొలి విజయం నమోదు చేసింది గుజరాత్.
మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో గుజరాత్ జెయింట్స్ కొత్త అధ్యాయం లిఖించింది. చావోరేవో పోరులో ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చి ఎలిమినేటర్‌కు దూసుకెళ్లింది. 168 పరుగుల ఛేదనలో ముంబైని అద్భుతంగా కట్టడి చేసిన గుజరాత్ 11 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ లీగ్‌లో ముంబైని తొలిసారి ఓడించడమే కాకుండా నాకౌట్ దశకు అర్హత సాధించింది.
A memorable victory! 🧡@Giant_Cricket clinch a thrilling contest by 1⃣1⃣ runs to book their place in the #TATAWPL 2026 playoffs 🔝
Scorecard ▶️ https://t.co/0ABkT4KS2M #KhelEmotionKa | #GGvMI pic.twitter.com/1yRtDxVoxy
— Women’s Premier League (WPL) (@wplt20) January 30, 2026
భారీ ఛేదనలో ముంబైకి సోఫీ డెవినే ఆరంభంలోనే షాకిస్తూ ఓపెనర్ హీలీ మాథ్యూస్(6) బౌల్డ్ చేసింది. ఆ తర్వాత కష్వీ గౌతమ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడాలనుకున్న సంజీవన్ సంజన(26)ను భారతి పెవిలియన్ పంపింది. ఆ తర్వాత నాట్ సీవర్ బ్రంట్(2) సైతం బిగ్ షాట్ ఆడి బౌండరీ లైన్ వద్ద అనుష్క చేతికి చిక్కింది. దాంతో.. 82కే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబైని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(82 నాటౌట్), అమేలియా కేర్(20) ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని జార్జియా వరేహం విడదీసింది. 45 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసింది. రాజేశ్వరీ ఓవర్లో అమన్‌జోత్ కౌర్(13) స్టంపౌట్ కావడంతో గుజరాత్ ఊపిరిపీల్చుకుంది.
SMACKED and again! 🎇
Harmanpreet Kaur is timing them sweetly in the middle 🤌
Updates ▶️ https://t.co/0ABkT4LpSk #TATAWPL | #KhelEmotionKa | #GGvMI | @ImHarmanpreet pic.twitter.com/yGXvtBRkh3
— Women’s Premier League (WPL) (@wplt20) January 30, 2026
కానీ, క్రీజులో హర్మన్‌ప్రీత్ ఉండడతో ముంబై ధీమాతో ఉంది. 19వ ఓవర్లో రెండు ఫోర్లతో రన్స్ రాబట్టింది కౌర్. చివరి ఓవర్లో విజయానికి 26 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపింది. రెండో బంతికి పరుగు తీయలేదు. మూడో బంతిని ఆఫ్‌సైడ్‌లో సిక్సర్‌గా మలిచింది. అయితే.. నాలుగో బంతికి సింగిల్ రావడంతో.. ఖేమ్నర్ ఔటయ్యింది. 11 పరుగుల తేడాతో గెలుపొందిన గుజరాత్ ఎలిమినేటర్‌కు క్వాలిఫై అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ప్రత్యర్ధి ముంబై ఇండియన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది . పవర్ ప్లేలో ముంబై బౌలర్ల జోరుతో తడబడిన గుజరాత్‌ను కెప్టెన్ అష్లీ గార్డ్నర్(46), జార్జియా వరేహం(44 నాటౌట్)లు ఆదుకున్నారు. 71కే 3 వికెట్లు పడిన వేళ వీరిద్దరూ తమ విధ్వంసక ఆటతో చెలరేగారు. బౌండరీల మోతతో ముంబై బౌలర్లను బెంబేలిత్తించారు. దాంతో, గుజరాత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లే కోల్పోయి 167 పరుగులు చేసింది.