Harmanpreet Kaur | టీ20ల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు.. తొలి క్రికెటర్‌గా ఘనత
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి క్రికెట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఆమె గుర్తింపు సాధించింది. రోహిత్ శర్మ (148 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సుజీ బేట్స్ (143 మ్యాచ్‌లతో) థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.
Harmanpreet Kaur : భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి క్రికెట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఆమె గుర్తింపు సాధించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో హర్మన్‌ప్రీత్ 150వ మ్యాచ్ ఆడింది. ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్‌లో భారత పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకూ 148 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ సుజీ బేట్స్ (143 మ్యాచ్‌లతో) థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత పొట్టి క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్లు ఎవరంటే..? ఇంగ్లండ్ క్రికెటర్ డానీ వ్యాట్ (141 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియన్ ప్లేయర్ అలిసా హేలీ (139) ఎలిసే పెర్రీ (ఆస్ట్రేలియా) 137 మ్యాచులతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు.
3 వేల పరుగుల క్లబ్లో
తన 150 టీ20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ఘనత సొంతం చేసుకుంది. టీ20ల్లో 3 వేల రన్స్ పూర్తి చేసుకుంది.హర్మన్‌ప్రీత్ 2009లో పొట్టి క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. అది కూడా ఐసీసీ తొలిసారి నిర్వహించిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఆమె మొదటి మ్యాచ్ ఆడింది. 2018 నుంచి పొట్టి జట్టు కెప్టెన్‌గా కొనసాగుతోంది.ఆ ఏడాది ఇండియా సెమీఫైనల్ చేరింది. 2020లో ఫైనల్ చేరిన భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆమె టీమిండియాకు సారథ్యం వహించడం ఇది మూడోసారి.
డబ్ల్యూపీఎల్‌లో భారీ ధర
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో హర్మన్‌ప్రీత్ కౌర్ భారీ ధర పలికింది. రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన వేలంలో రికార్డు ధర దక్కించుకుంది. ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.44 కోట్లకు కొనుగోలు చేసింది. మార్చి 1న ముంబైలో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ప్రారంభం కానుంది.
Harmanpreet Kaur becomes the first player, male or female, to play 150 T20Is 👏 👏
Nine out of the top ten on the women’s T20I caps list are playing in the T20 World Cup in South Africa.#T20WorldCup pic.twitter.com/l7AGMpbBC5
— Wisden (@WisdenCricket) February 20, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

