Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ శక్తిని, కీర్తిని విశ్వవ్యాప్తం చేసే చరిత్రాత్మక రోజు ఆవిష్కృతమైంది. దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బృందం ప్రపంచ కప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. డయానా ఎడుజి, అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్.. వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యంకాని కప్‌ను దేశానికి అందించింది హర్మన్‌ప్రీత్. సమిష్టి పోరాటమే మంత్రగా టీమిండియా చెలరేగగా.. నవంబర్ 2 ఆదివారం నాడు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆవిష్కృతమైంది. విజయాన్ని నమ సువర్ణాధ్యాయంగా సొంతగడ్డపై టీమిండియాకు కలల ట్రోఫీని కట్టబెట్టిన ఈ పంజాబీ ఇది ఆరంభం మాత్రమే అంటోంది. వలర్డ్ కప్ జోష్‌తో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు ఒడిసిపడుతామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న హర్మన్‌ప్రీత్ క్రికెట్ ప్రస్థానమిది.
జాతీయ జట్టుకు ఆడడం, వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొందడం ప్రతి క్రికెటర్ కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కే 21 ఏళ్లు పట్టింది. మన మహిళల జట్టు మాత్రం నలభై దశాబ్దాలు చకోర పక్షిలా ఎదురుచూసింది. రెండుసార్లు ఫైనల్ చేరినా.. ఒత్తిడిని జయించలేక కుప్పకూలింది. ఇక మూడో ప్రయత్నంలో మాత్ర హర్మన్‌ప్రీత్ సేన ఏ పొరపాటుకు తావివ్వలేదు. 16 ఏళ్ల కెరీర్లోనే హర్మన్‌ప్రీత్ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది. లీగ్ దశలో వరుసగా మూడు ఓటముల నుంచి తేరుకొని జట్టును విజయపథాన నడిపిన ఆమె.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 89 పరుగులతో మెరిసింది.
The moment all of India has been waiting for as ICC Chairman @JayShah hands India captain Harmanpreet Kaur the trophy 🏆#CWC25 pic.twitter.com/Y4V1Ub2Ofu
— ICC (@ICC) November 2, 2025
డీవైపాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తన చేసింది 20 పరుగులే అయినా వ్యూహాత్మక నిర్ణయాలతో దక్షిణాఫ్రికాను దెబ్బతీసింది హర్మన్‌ప్రీత్. ప్రత్యర్థి బ్యాటర్లు కుదురుకున్న వేళ.. పార్ట్‌టైమ్ బౌలర్ షఫాలీ వర్మకు బంతి అందించిన ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీప్తి శర్మ ఓవర్లో డీక్లెర్క్ కొట్టిన బంతిని వెనక్కి పరుగెడుతూ క్యాచ్ పట్టిన హర్మన్‌ప్రీత్.. మేము సాధించాం అంటూ సహచరులతో గెలుపు సంబురాలు చేసుకుంది.
పంజాబ్‌లోని మొగా గ్రామంలో1989 మార్చి 8న జన్మించింది. ఆమె తండ్రి హర్మీందర్ సింగ్ జిల్లా న్యాయస్థానంలో క్లర్క్. తల్లి సత్విందర్ కౌర్ గృహిణి. హర్మన్ వాళ్ల నాన్నకు క్రీడలంటే ఆసక్తి. ఆయన బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్ ఆడడం చూసి క్రీడల మీద ఇష్టం పెంచుకుంది తను. దాంతో, అప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆమె క్రికెట్‌పై సీరియస్‌గా తీసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలో చేరింది. క్రికెటర్‌గా రాణించేందుకు అన్ని నైపుణ్యాలున్న హర్మన్‌ను చూసిన కమల్దీష్ సింగ్ సోధీ.. తన ప్రైవేట్ అకాడమీలో చేర్చుకున్నాడు. అక్కడ అబ్బాయిలతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేసిన తను.. బలంగా షాట్లు కొట్టడంతో పట్టుసాధించింది.
Harmanpreet Kaur and her family members pose for photographs with the trophy after winning the ICC Women’s World Cup 2025#WomensWorldCup2025 pic.twitter.com/pdbUcICg2A
— Sports Yaari (@YaariSports) November 2, 2025
సోధీ తర్ఫీదులో రాటుదేలిన హర్మన్ జూనియర్ స్థాయిలో సత్తా చాటి.. 2009 మార్చిలో వన్డేల్లో అరంగేట్రం చేసింది. అదే ఏడాది జూన్‌లో టీ20ల్లోనూ ఎంట్రీ ఇచ్చిన తను నిలకడగా రాణిస్తూ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. 2012లో తొలిసారి ఆసియా కప్‌లో సారథ్యం వహించిన హర్మన్ 2016లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమె నేతృత్వంలో.. భారత జట్టు 2020లో పొట్టి ప్రపంచ కప్ ఫైనల్ చేరింది. అనంతరం మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు రెండు ట్రోఫీలు సాధించి పెట్టింది హర్మన్.
𝐊𝐚𝐩𝐢𝐥 𝐃𝐞𝐯 🤝 𝐌𝐒 𝐃𝐡𝐨𝐧𝐢 🤝 𝐇𝐚𝐫𝐦𝐚𝐧𝐩𝐫𝐞𝐞𝐭 𝐊𝐚𝐮𝐫 🇮🇳🏆
Harmanpreet Kaur joins the elite club as only the third Indian skipper to win an ODI World Cup! 📖✍️#CWC25 #INDvSA #Sportskeeda #Cricket #SKC pic.twitter.com/ey3wao6087
— Sportskeeda (@Sportskeeda) November 2, 2025
అయితే.. టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలనే కల మాత్రం నెరవేరలేదు. అన్మోల్ మజుందార్ కోచ్‌గా వచ్చాక జట్టులో స్థిరత్వం రావడంతో.. ఇద్దరూ కలిసి 2025 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. ప్రతిభావంతులైన క్రాంతి గౌడ్, శ్రీచరణిలకు తుది జట్టులోకి తీసుకొని వాళ్లతో అనుకున్న ఫలితాలను రాబట్టింది హర్మన్‌ప్రీత్. భారత జట్టును ఫైనల్ చేర్చిన ఆరో కెప్టెన్‌గా రికార్డు సాధించిన తను.. కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ తర్వాత మెగా ట్రోఫీని అందించిన మూడో భారత క్రికెటర్‌గా అవతరించింది. పంజాబీ అయిన ఆమె సహచరుల కరతాళధ్వనుల మధ్య ‘భాంగ్రా’ నృత్యం చేస్తూ ఐసీసీ చీఫ్ జై షా నుంచి ట్రోఫీని స్వీకరించింది.
వన్డే ప్రపంచ కప్ నాకౌట్స్‌లో రికార్డు బ్రేక్ చేసింది టీమిండియా కెప్టెన్. ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 89 పరుగులతో మెరిసిన కౌర్.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో 20 పరుగులకే ఔటైంది. అయితేనేమీ.. వరల్డ్ కప్ నాకౌట్స్‌లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకుంది తను. ఆస్ట్రేలియా వెటరన్ బిలిండా క్లార్క్ 6 ఇన్నింగ్స్‌ల్లో 330 రన్స్‌తో నెలకొల్పిన రికార్డును కౌర్ బ్రేక్ చేసింది.
ICE COLD HARMAN 💥
Harmanpreet now has the most runs in WODI World Cup knockouts history 🔥 pic.twitter.com/cyliyVHS9u
— Cricket.com (@weRcricket) November 2, 2025
భారత కెప్టెన్ కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 331 రన్స్ చేయడం విశేషం. ఆసీస్ ప్రస్తుత కెప్టెన్ అలీసా హేలీ 309 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ నాయకీ నాట్ సీవర్ బ్రంట్ (281 రన్స్) నాలుగో ప్లేస్‌లో నిలిచింది. న్యూజిలాండ్ వెటరన్ డెబ్బీ హాక్లే 240 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.