దుబాయ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రాణిస్తున్న భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటింది మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్ తిరిగి టాప్-10లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన తొలి టీ20లో 35 బంతుల్లోనే అజేయంగా 54 పరుగులు చేసిన హర్మన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నాలుగు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 10 ర్యాంక్‌కు దూసుకెళ్లింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన మూడో ర్యాంక్ దక్కించుకుంది.