Australian Open : కొత్త ఏడాదిలో మొదటి గ్రాండ్‌స్లామ్‌లో కార్లోస్ అల్కారాస్(Carlos Alcaraz) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open)లో అదరగొడుతున్న ఈ టాప్ సీడ్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు చెక్ పెట్టాడు. అలాఅనీ జ్వెరెవ్ అలవోకగా తలవంచలేదు. స్పెయిన్ కెరాటానికి ముచ్చెమటలు పట్టించిన అతడు.. ఐదు గంటల 27 నిమిషాల పాటు పోరాడాడు. కానీ, చివరకు క్లాస్ ఆటతో చెలరేగిన అల్కరాస్‌ను విజయం వరించింది. ఓపెన్ ఎరాలో చిన్నవయసులోనే నాలుగు గ్రాండ్‌స్లామ్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా అల్కరాస్ రికార్డు నెలకొల్పాడు.
నిరుడు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ చెమటోడ్చిన అల్కరాస్‌కు ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యాడు. అప్పుడు సిన్నర్‌ను ఓడించేందుకు ఐదు గంటలు కష్టపడిన అతడు.. జ్వెరెవ్‌ను మట్టికరిపించేందుకు ఐదు గంటల 27 నిమిషాలు తీసుకున్నాడు. దూకుడైన ఆటతో జర్మనీ కుర్రాడికి షాకిస్తూ వరుసగా రెండు సెట్లు గెలిచిన అల్కరాస్.. నిర్ణయాత్మక సెట్‌ను ఒక్క పాయింట్‌తో కోల్పోయాడు. దాంతో.. నాలుగో సెట్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
Longest semifinal in Australian Open history 🙌 https://t.co/IT1ZlJHpvu
— #AusOpen (@AustralianOpen) January 30, 2026
దాదాపు ఐదున్నర గంటలు ప్రేక్షకులను అలరించిన ఈ మారథాన్ మ్యాచ్‌లో 6-4, 7-6, 6-7, 7-6, 7-5తో అల్కరాస్ విజేతగా నిలిచాడు. రెండో సెమీఫైనల్లో తలపడుతున్న జన్నిక్ సిన్నర్ , నొవాక్ జకోవిచ్‌లో ఒకరితో అతడు ఫైనల్ ఆడనున్నాడు. ఓపెన్ ఎరాలో అత్యంత చిన్నవయసు(22 ఏళ్లు)లోనే నాలుగు గ్రాండ్‌స్లామ్స్ ఫైనల్ చేరిన ఆటగాడిగా అల్కరాస్ రికార్డు సృష్టించాడు. 1993లో జిమ్ కొరియర్ పేరుతో ఉన్న రికార్డును ఈ యంగ్ సంచలనం బద్ధలు కొట్టాడు.