DCW vs MIW : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన ముంబై.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై పంజా విసిరింది. హర్మన్‌ప్రీత్ కౌర్(74) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు.. నాట్ సీవర్ బ్రంట్(70) మెరుపులతో భారీ స్కోర్ చేసిన ముంబై.. ఆ తర్వాత నికోలా కారీ(3-37) చెలరేగడంతో ఢిల్లీని పడగొట్టింది. చిన్నెల్లె హెన్రీ(56) అర్ధ శతకంతో ఆశలు రేపినా.. అవతలివైపు నుంచి ఆమెకు సహకరించేవాళ్లే కరువయ్యారు. దాంతో.. 196 పరుగుల ఛేదనలో ఢిల్లీ 145కే పరిమితమైంది.
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల ఖాతా తెరిచింది. ఆరంభ మ్యాచ్‌లో చేజారిన విజయాన్ని రెండో మ్యాచ్‌లో పట్టేసింది. మొదట కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(74), నాట్ సీవర్ బ్రంట్(70) అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. అనంతరం నికోలా కారీ(3-37), అమేలియా కేర్(3-24)ల ధాటికి ఢిల్లీ క్యాపిటిల్స్ బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. 50 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై ఘనంగా బోణీ చేసింది.
A convincing victory 👏
Harmanpreet Kaur-led Mumbai Indians bounce back with a massive 5⃣0⃣-run victory 🔝
Scorecard ▶️ https://t.co/aVKBHVKp7c #TATAWPL | #KhelEmotionKa | #MIvDC pic.twitter.com/W2S5eYyDNa
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
భారీ ఛేదనలో ఢిల్లీకి పవర్ ప్లేలోనే వరుసగా షాక్‌లు తగిలాయి. ఓపెనర్ లిజెల్లే లీ(10)ని నాట్ సీవర్ బ్రంట్ ఔట్ చేసి తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బంతి అందుకున్న నికోలా కారీ(3-22) ఒకే ఓవర్లో షఫాలీ వర్మ(8), లారా వొల్వార్డ్త్(9)లను బౌల్డ్ చేసి ఢిల్లీని దెబ్బ కొట్టింది. ఆ తర్వాత షబ్నం ఇస్మాయిల్ ఓవర్లో జెమీమా రోడ్రిగ్స్(1) ఔటయ్యింది. స్లిప్‌లో బౌండరీ కోసం తను కట్ షాట్ ఆడగా వికెట్ కీపర్ కమలిని కుడివైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా బంతిని అందుకుంది. దాంతో. 33కే ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది.
That is an INCREDIBLE take! 😲
🎥 17-year-old G Kamalini takes a special catch diving to her right 🫡
Updates ▶️ https://t.co/aVKBHVKp7c #TATAWPL | #KhelEmotionKa | #MIvDC pic.twitter.com/fbjAkVQoH8
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
ఢిల్లీని గట్టెక్కించాలనుకున్న మరినే కాప్(10) ఒక సిక్సర్, ఫోర్ బాది క్రీజులో నిలబడేలా కనిపించింది. కానీ, కారీ ఓవర్లో తను కూడా క్యాచ్ ఇచ్చి డగౌట్ చేరింది. అంతే.. 46కే సగం వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ప్రస్తుతం నిక్కీ ప్రసాద్(12), చిన్నెల్లె హెన్రీ(56)లు దూకుడుగా ఆడారు. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోవడంతో అమేలియా ఓవర్లో పెద్ద షాట్ ఆడాలనుకున్న నిక్కీ బౌల్డయ్యింది. ఓవైపు వికెట్లు పడుతున్నా హెన్రీ మాత్రం బౌండరీలతో చెలరేగింది. కారే ఓవర్లో భారీ సిక్సర్‌తో అర్ధ శతకం పూర్తి చేసుకున్న తను.. అమేలియా బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోయి బండరీ వద్ద కారీ చేతికి దొరికింది. హెన్రీ వికెట్‌తో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. 19వ ఓవర్లోనే 145కు ఆలౌటైన ఢిల్లీ 50 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.