DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్ మరింత కష్టాల్లో పడింది. జెస్ జొనాసెన్ (4) ఔటయ్యింది. హర్లీన్ డియోల్ ఓవర్లో లాంగాఫ్‌లో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగింది. దాంతో, 81 రన్స్ వద్ద ఢిల్లీ ఐదో వికెట్ పడింది. మరిజానే కాప్ (23), తానియా భాటియా (0) క్రీజులో ఉన్నారు. వికెట్లు పడుతున్నా మరిజానే ధాటిగా ఆడుతోంది. జొనాసెన్తో ఐదో వికెట్‌కు 29 రన్స్ జోడించింది. ఢిల్లీ విజయానికి 48 బంతుల్లో 66 పరుగులు కావాలి.