Hardik Pandya | ముంబై ఇండియన్స్‌కు పాండ్యా గుడ్ బై.. హింట్ ఇచ్చేశాడా..!
Hardik Pandya ఒకప్పుడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తోపు ఆటగాడైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్‌గా మాత్రం మెప్పించలేకపోయాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత జట్టుకు వరసగా సిరీస్‌లు గెలిపించిన ఈ బరోడా స్టార్.. ఐపీఎల్లో మాత్రం ముంబైని ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు.
Hardik Pandya ఒకప్పుడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తోపు ఆటగాడైన హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్‌గా మాత్రం మెప్పించలేకపోయాడు. వరసగా మూడు సీజన్లలో నిరాశజనక ప్రదర్శనతో ముంబై అభిమానులు, యాజమాన్యం ఆశల్ని వమ్ము చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత జట్టుకు వరసగా సిరీస్‌లు గెలిపించిన ఈ బరోడా స్టార్.. ఐపీఎల్లో మాత్రం ముంబైని ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. 19వ సీజన్లో ఫ్లాప్ షో కారణంగా.. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న అతడు వచ్చే సీజన్లో కొత్త జట్టుకు ఆడడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా.. ఆల్‌రౌండర్‌గా దారుణంగా విఫలమయ్యాడు. స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం.. ప్రధాన పేసర్ బుమ్రా వికెట్లు తీయకపోవడం ముంబైని ముంచాయి. ఒకింత సమిష్టి వైఫల్యం ఓ కారణమైనా.. సారథి పాండ్యావైపే వేళ్లు చూపిస్తున్నారంతా. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి.
Clear statement🚨 from Hardik Pandya Hardik is going to leave Mumbai Indians 😳#HardikPandya #mumbaiIndians #IPL2026 #CricketTwitter #IPLfinal
#SRHvsRR pic.twitter.com/IRoNTvjb7Q— Visionary EV Media🇮🇳 (@Visionary_eagle) May 28, 2026
అందుకు బలం చేకూర్చేలా లీగ్ దశ ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్.. బుమ్రా టాస్కు వచ్చారు. ఆటగాడిగా, నాయకుడిగా తేలిపోయిన పాండ్యా మానసిక ఒత్తిడితోనూ బాధ పడుతున్నాడట. అందుకని.. అతడు ముంబైని వీడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సీజన్ మధ్యలోనే యాజమాన్యానికి చెప్పేశాడని తెలుస్తోంది. అయితే.. ముంబై ఫ్రాంజైజీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
🚨 𝑹𝑬𝑷𝑶𝑹𝑻𝑺 🚨
Hardik Pandya is set to quit the Mumbai Indians franchise and had conveyed it to the management mid-season, as he was mentally stressed and completely exhausted after disastrous IPL! 👀🏏
(Source: PTI)#IPL2026 #MI #HardikPandya #Sportskeeda pic.twitter.com/Jckdefsf5h
— Sportskeeda (@Sportskeeda) May 29, 2026
మళ్లీ పాత కథ..
ఐపీఎల్ 17వ సీజన్‌తో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన పాండ్యాకు రోహిత్ శర్మ అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడి మాటకు విలువ లేకపోవడంతో మైదానంలో రాణించలేకపోయాడు పాండ్యా. కానీ, 18వ సీజన్లో జట్టును గొప్పగా నడిపించాడు. తొలి రెండు మ్యాచులు ఓడిన ముంబైని గెలుపు బాట పట్టించి ఏకంగా ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు పాండ్యా.

కానీ, 19వ సీజన్లో మాత్రం మళ్లీ పాత కథే అన్నట్టు ముంబైకి ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్ రికెల్టన్, డికాక్, తిలక్ వర్మ మినహా బ్యాటింగ్ యూనిట్ చెత్త ప్రదర్శనకు తోడు.. పవర్ ప్లేలోనే వికెట్లు తీసే బుమ్రా, బౌల్ట్ నిరాశపరిచారు. ధనాధన్ ఆటతో అలరించే పాండ్యా కేవలం 206 పరుగులే చేశాడు. ఫలితంగా14 మ్యాచుల్లో 4 విజయాలతో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది ముంబై.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

