Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Nana Patekar | ప్రముఖ నటుడు (Noted Actor) నానా పటేకర్ (Nanapatekar) మృతికి సంబంధించిన సస్పెన్స్ వీడిపోయింది. ఆయన మరణం సహజమైనదేనని, తీవ్రమైన గుండెపోటు (Heart Attack) కారణంగానే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టం నివేదిక (Postmartum report) లో వెల్లడైంది. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) వైద్యుల బృందం ఈ నివేదికను గోవా పోలీసుల (Goa Police) కు అందజేసింది.
Nana Patekar : ప్రముఖ నటుడు (Noted Actor) నానా పటేకర్ (Nanapatekar) మృతికి సంబంధించిన సస్పెన్స్ వీడిపోయింది. ఆయన మరణం సహజమైనదేనని, తీవ్రమైన గుండెపోటు (Heart Attack) కారణంగానే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టం నివేదిక (Postmartum report) లో వెల్లడైంది. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) వైద్యుల బృందం ఈ నివేదికను గోవా పోలీసుల (Goa Police) కు అందజేసింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుండెకు రక్తాన్ని సరఫరాచేసే ప్రధాన ధమనిలో రక్తం గడ్డకట్టడంతో గుండెపోటు సంభవించి నానా పటేకర్ మరణించారు. పోస్ట్‌మార్టం నివేదిక వివరాలను కుటుంబసభ్యులకు తెలియజేయగా వారు కూడా అంగీకరించారని, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్ 8వ తేదీ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నానా పటేకర్ తన కుటుంబ స్నేహితుడికి వాట్సాప్ ద్వారా అనారోగ్యంగా ఉన్నట్లు సందేశం పంపారు.
వెంటనే దోనా పౌలాలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుమారు 45 నిమిషాలపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పనాజీ పోలీసులు మొదట BNSS సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తాజా పోస్ట్‌మార్టం నివేదికతో ఆయన మరణం గుండెపోటు కారణంగా జరిగిందని తేలింది. దాంతో పటేకర్ కుమారుడు మల్హర్ పటేకర్, మేనల్లుడు ప్రసాద్ పటేకర్‌పై ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టమైంది.
నానా పటేకర్ అంత్యక్రియలు గురువారం పుణే జిల్లాలోని డోంజే గ్రామంలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. ఈ అంతిమయాత్రకు సినీ పరిశ్రమ నుంచి జాకీ ష్రాఫ్, దర్శకులు అనిల్ శర్మ, అనీస్ బాజ్మీ, నిర్మాత ఫిరోజ్ నడియాడ్వాలా వంటి ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

