Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Boyfriend Falls From Balcony | కేఫ్ యజమాని అయిన వ్యక్తి ఒక అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలు తన డ్రైవర్‌తో అతడ్ని ఆసుపత్రికి తరలించింది. ఈ విషయాన్ని ప్రియుడి తల్లికి చెప్పింది. అయితే తన కుమారుడు మరణించడంతో ప్రియురాలి చిత్రహింసలపై ఆమె ఫిర్యాదు చేసింది.
లక్నో: కేఫ్ యజమాని అయిన వ్యక్తి ఒక అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలు తన డ్రైవర్‌తో అతడ్ని ఆసుపత్రికి తరలించింది. ఈ విషయాన్ని ప్రియుడి తల్లికి చెప్పింది. అయితే తన కుమారుడు మరణించడంతో ప్రియురాలి చిత్రహింసలపై ఆమె ఫిర్యాదు చేసింది. (Boyfriend Falls From Balcony) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. కేఫ్ యాజమాని అయిన 28 ఏళ్ల శివ శర్మ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్ధా దూబే మధ్య రిలేషన్ షిప్ ఉన్నది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కాగా, అక్టోబర్ 9న రాత్రి 8.30 గంటల సమయంలో హజ్రత్‌గంజ్ ప్రాంతంలో శ్రద్ధా దూబే నివసించే అపార్ట్మెంట్ బిల్డింగ్ నాలుగో అంతస్తులోని బాల్కానీ నుంచి శివ శర్మ కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ప్రియురాలు తన డ్రైవర్‌తో ఆసుపత్రికి తరలించింది. శివ శర్మ తల్లికి ఈ విషయం చెప్పింది. దీంతో ఆందోళన చెందిన శివ తల్లి హుటాహుటిన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అత్యవసర విభాగం వద్దకు చేరుకున్నది.
అయితే అక్కడ ఒక ప్రైవేట్ అంబులెన్స్ నిలిపి ఉంచడాన్ని శివ తల్లి గమనించింది. అంబులెన్స్ వద్ద ఉన్న వ్యక్తి శ్రద్ధా డ్రైవర్‌గా పరిచయం చేసుకున్నాడు. తన కుమారుడికి ఏం జరిగిందని ఆమె అడగ్గా తనకు తెలియదని అతడు చెప్పి వెళ్లిపోయాడు. శివను ఆసుపత్రిలోకి తీసుకెళ్లగా అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
మరోవైపు తన కుమారుడు శివ శర్మ, సహజీవనం చేస్తున్న ప్రియురాలైన శ్రద్ధా దూబే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతడి తల్లి రంజనా శర్మ తెలిపారు. అయితే ఈ నిర్ణయం తర్వాత నుంచి తన కుమారుడిని ప్రియురాలు బ్లాక్మెయిల్ చేయడంతో పాటు వేధిస్తున్నదని ఆమె ఆరోపించారు. అతడి అసభ్యకరమైన వీడియోలు షేర్ చేస్తానని, అతడి పరువుకు భంగం కలిగిస్తానని శ్రద్ధా బెదిరించినట్లు తెలిపారు. తన కుమారుడి శరీరంపై గాయాలు ఉండటంతో అతడ్ని హింసించి కొట్టి, బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేసి హత్య చేసినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
దీంతో శ్రద్ధా దూబే, ఆమె సోదరి రష్మి దూబే, డ్రైవర్ డానిష్, ఆదిల్ అనే వ్యక్తి, ఇతర గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. శివ శర్మ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

