పుణె: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో.. హార్దిక్ బౌలింగ్ చేస్తూ కాలి గాయానికి లోనయ్యాడు. అతని తొడ కండరాల పట్టేసినట్లు తెలుస్తోంది. బంగ్లా బ్యాటర్ లింటన్ దాస్ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత బంతికే హార్దిక్ గాయపడ్డాడు. జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి హార్దిక్‌ను తీసుకెళ్లాడు. అయితే మిగితా మూడు బంతుల్ని విరాట్ కోహ్లీ బౌల్ చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 93 రన్స్ చేసింది. తంజిద్ హసన్ 51 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
🚨 Update 🚨
Hardik Pandya’s injury is being assessed at the moment and he is being taken for scans.
Follow the match ▶️ https://t.co/GpxgVtP2fb#CWC23 | #TeamIndia | #INDvBAN | #MeninBlue pic.twitter.com/wuKl75S1Lu
— BCCI (@BCCI) October 19, 2023