గురువారం 02 జూలై 2020
Sports - Jun 14, 2020 , 15:50:11

విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు అనుమతించాలి:హర్భజన్‌సింగ్‌

విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు అనుమతించాలి:హర్భజన్‌సింగ్‌

న్యూ ఢిల్లీ: ఇండియన్‌ క్రికెట్‌ క్రీడాకారులను విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు అనుమతించాలని ప్రముఖ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ బీసీసీఐని కోరారు. ఇందుకోసం ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ఓ విధానాన్ని రూపొందించాలని ఆయన ఇండియన్‌ క్రికెట్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ‘విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు బీసీసీఐ ఇండియన్‌ ప్లేయర్స్‌కు అనుమతి ఇస్తుందని భావిస్తున్నా. బోర్డుతో కాంట్రాక్ట్‌ లేని ఆటగాళ్లను అనుమతిస్తారని అనుకుంటున్నా. దీనికోసం ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. 50 టెస్టులు లేదా 35 ఏళ్లు పైబడినవారిని అనుమతిస్తే బాగుంటుంది.’ అని హర్భజన్‌సింగ్‌ క్రికెట్‌ ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ చానల్‌ ద్వారా పేర్కొన్నారు.  

  హర్భజన్‌సింగ్‌ వ్యాఖ్యలను ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌ సమర్థించారు. ౩౦ ఏళ్ల వయస్సు దాటి, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడలేని వారిని విదేశీ లీగ్‌లు ఆడేందుకు అనుమతించాలని వారు కోరారు. logo