Harbhajan Singh : సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు తమ విలువేంటో బ్యాట్‌తోనే చెబుతున్నారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో.. తమ క్లాస్ ఆటకు తిరుగులేదని చాటుతూ జట్టుకు భారీ స్కోర్లు అందిస్తున్నారు. కోహ్లీ వరుసగా ఒక ఫిప్టీ, రెండు సెంచరీలతో .. రోహిత్ ఒక శతకం, ఫిఫ్టీతో ఫామ్ చాటుకున్నా.. సరే వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027)బెర్తుపై మాత్రం సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఏమీ సాధించిన వ్యక్తుల చేతుల్లో కోహ్లీ, హిట్‌మ్యాన్ భవిష్యత్ ఉండడం అత్యంత బాధాకరమని అన్నాడు ఒకప్పటి ఆఫ్ స్పిన్నర్.
ప్రస్తుతం భారత క్రికెట్లో అంతర్గత విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సీనియర్లు కోహ్లీ, రోహిత్‌కు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ఏమాత్రం పొసగడం లేదనేది వాస్తవం. దిగ్గజ ఆటగాళ్లైన రో-కో మైదానంలో అదరగొడుతున్నా.. వీరికి వరల్డ్‌కప్‌లో అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియడం లేదు. అయితే.. మాజీ క్రికెటర్లు మాత్రం విరాట్, రోహిత్‌కు మద్దుతుగా నిలుస్తున్నారు. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ భారత మేనేజ్మెంట్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లైన విరాట్, హిట్‌మ్యాన్ భవితవ్యం ఏమంత పెద్ద ఘనతలు సాధించిన గౌతీ, అగార్కర్ చేతుల్లో ఉండడం దారుణమని భజ్జీ విమర్శలు గుప్పించాడు.
.@harbhajan_singh slams decision-makers deciding @imVkohli‘s future in international cricket! 🔥 pic.twitter.com/Dm2u0HKjeP
— ViratGang.in (@ViratGangIN) December 4, 2025
‘రో – కో భవితవ్యంపై నేను ఏమీ మాట్లాడదలుకోలేదు. ఎందుకంటే.. ఒక క్రికెటర్‌గా నేను ఇప్పుడు చూస్తున్నవి నా విషయంలోనూ జరిగాయి. నేను ఒక్కడినే కాదు చాలామంది ఆటగాళ్లు ఇబ్బందిపడ్డారు. టాలెంట్ ఉన్నా, నిలకడగా రాణిస్తున్నా చాలా జరగడం దురదృష్టకరం. మనం వీటి గురించి అస్సలు మాట్లాడం. చర్చ కూడా చేయం. అవును.. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ భవిష్యత్తు కూడా క్రికెటర్‌గా ఏమంత గొప్ప ఘనతలు సాధించని వారి చేతుల్లో ఉంది. రో -కో ఇద్దరూ ఎల్లప్పుడూ పరుగులు సాధిస్తుంటారు. వీరిద్దరూ భారత గొప్ప క్రికెటర్లు. రోజురోజుకు మరింత ద్రుఢంగా మారుతున్నారిద్దరు. ఛాంపియన్ ప్లేయర్లు అయిన కోహ్లీ, హిట్‌మ్యాన్ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని హర్భజన్ తెలిపాడు.
Sunil Gavaskar🎙; These 2 doesn’t need Indian team….Indian team needs these two…{Smiles}
– {Rohit Sharma×Virat Kohli} pic.twitter.com/3mvT4WUuvq
— Gillfied⁷ (@Gill_Iss) November 30, 2025
నిరుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో విజయంత తర్వాత కోహ్లీ, రోహిత్ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఇక టెస్టులు, వన్డేల్లో కొనసాగుతారనుకుంటే.. జూన్‌లో సుదీర్ఘ ఫార్మాట్‌కు అల్విదా చెప్పేశారిద్దరూ. గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కారణంగానే వీరిద్దరూ టెస్టుల నుంచి తప్పుకున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్లోనే ఆడుతున్న రో-కోకు వరల్డ్ కప్ ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అందుకే.. రాంచీ వన్డేలో సెంచరీ తర్వాత కోహ్లీ గాల్లోకి పంచ్ విసిరి కసిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఆటను సందేహించిన గంభీర్, అగార్కర్‌పై కోపంతోనే విరాట్ అంత అగ్రెస్సివ్‌గా సంబురాలు చేసుకున్నాడని అందరూ అనుకుంటున్నారు.
Back-to-back ODI hundreds for Virat Kohli 🔥#INDvSA 📝: https://t.co/b4ectUVL0T pic.twitter.com/mCNbrJGNOL
— ICC (@ICC) December 3, 2025