అంతర్జాతీయ క్రికెట్కు హర్భజన్ వీడ్కోలు

- సహచరుల శుభాకాంక్షల వెల్లువ
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కిన ఈ పంజాబ్ టర్బోనేటర్.. టీమ్ఇండియా సాధించిన ఎన్నో అపురూప విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐదేండ్లుగా టీమ్ఇండియాకు దూరమైన హర్భజన్ శుక్రవారం అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘ప్రతి మంచి పనికి ముగింపు ఉంటుంది. ఇవాళ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నా. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 23 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం అద్భుతంగా, మధుర జ్ఞాపకంగా మారడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు’అని 41 ఏండ్ల భజ్జీ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దీంతో బీసీసీఐ సహా తాజా, మాజీ క్రికెటర్లు హర్భజన్కు శుభాకాంక్షలు తెలిపారు. టీమ్ఇండియా తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడిన హర్భజన్.. అందులో వరుసగా 417, 269, 25 వికెట్లు పడగొట్టాడు. 1998లో భారత జట్టుకు తొలిసారి ఎంపికైన భజ్జీ.. 2016లో చివరి సారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తరఫున మెరిసిన ఈ పంజాబ్ పుత్తర్.. దాదాపు పాతికేండ్లుగా ఆటతో అనుబంధం కొనసాగిస్తూ వచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- harbajan singh
- Team india
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

