BGT | పెర్త్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన భారత జట్టులో ‘నయా వాల్’ ఛటేశ్వర్ పుజారా లేకపోవడం ఆతిథ్య జట్టుకు ఎంతో కలిసొస్తుందని ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అభిప్రాయపడ్డాడు. గత రెండు పర్యటనలలో భారత్..బీజీటీని సొంతం చేసుకోవడంలో పుజారాది కీలకపాత్ర. హాజిల్‌వుడ్ మాట్లాడుతూ ‘ఈసారి భారత జట్టులో పుజారా లేకపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. గత రెండు పర్యటనలలో అతడు కీలకపాత్ర పోషించాడు.
అతడి వికెట్ తీసేందుకు ప్రతిసారి ప్రయత్నించేవాడిని’ అని అన్నాడు. పుజారా లేకపోయినా ప్రస్తుతం భారత జట్టులో అద్భుతంగా ఆడగల నైపుణ్యమున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారని అన్నాడు. ఖలీల్ స్థానంలో దయాల్ లెఫ్టార్మ్ సీమర్ యశ్ దయాల్ ఆస్ట్రేలియాలో ఖలీల్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. బంగ్లాతో సిరీస్‌లో ఎంపికైనప్పటికీ దయాల్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.