ఢిల్లీ: చైనా వేదికగా జరిగిన హాంగ్జో, చెంగ్డూ ఓపెన్స్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్లు సత్తా చాటారు. హాంగ్జో ఓపెన్‌లో అన్‌సీడెడ్ భారత ఆటగాళ్లు జీవన్, విజయ్.. 4-6, 7-6(7/5), 10-7తో ఫ్రాంట్జెన్, జెబెన్స్(జర్మనీ)ను ఓడించి డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 35 ఏండ్ల జీవన్‌కు ఇది రెండో ఏటీపీ టైటిల్ కాగా విజయ్‌కు ఇదే మొదటిది. తొలి సెట్లో ఓడినా తర్వాత పుంజుకున్న భారత ద్వయం రెండో సెట్‌ను టైబ్రేక్‌తో గెలుచుకుంది. మూడో సెట్లో ప్రత్యర్థులు పోరాడినా దీటుగా బదులిచ్చి విజేతగా నిలిచింది.