Koneru Hampi | బాంబుల మోతల మధ్య చెస్ ఆడలేను.. క్యాండిడేట్స్ టోర్నీని బాయ్‌కాట్ చేస్తున్నా..!
Koneru Hampi : భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి(Koneru Hampi) కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్(FIDE Candidates Tournament) నుంచి ఆమె వైదొలిగింది.
Koneru Hampi : భారత ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి (Koneru Hampi) కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకమైన ఫిడే మహిళల క్యాండిటేట్స్ టోర్నమెంట్(FIDE Candidates Tournament) నుంచి ఆమె వైదొలిగింది. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నందున భదత్రపై ఆందోళనగా ఉందని చెప్పిన ఆమె.. బాంబుల మోతల మధ్య చెస్‌పై శ్రద్ధ పెట్టడం సాధ్యమవ్వదని వాపోయింది. ఇదివరకే టోర్నీ వేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హంపి చివరకు టోర్నీని బాయ్‌కాట్ చేయాలని భావించింది. ఈ విషయాన్ని సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించిందీ గ్రాండ్‌మాస్టర్.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత క్రీడాకారిణులు ప్రధాన టోర్నీలకు దూరమవుతున్నారు. దుబాయ్‌లో చిక్కుకొని ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ పోటీలకు పీవీ సింధు దూరమవ్వగా.. కోనేరు హంపి సైతం మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. మధ్య ఆసియాలోని సిప్రస్‌లో మార్చి 28 నుంచి మొదలయ్యే ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తాను ఆడడం లేదని సోమవారం హంపి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
Koneru Humpy has withdrawn from the Women’s Candidates Tournament.
She was one of the favourites to win the competition.
Here’s why: #Chess #FIDEhttps://t.co/01bpvOUqr5
— India Today Sports (@ITGDsports) March 23, 2026
‘చాలా సమయం ఆలోచించి నేను కీలక నిర్ణయం తీసుకున్నాను. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నా. వ్యక్తిగత భద్రత, సురక్షితంగా ఉండడం కంటే ఏ ఈవెంట్ ముఖ్యమైనది కాదు. నిర్వాహకులు భరోసా కల్పించినప్పటికీ ప్రస్తుతం అక్కడి పరిస్థితుల్లో నేను సురిక్షితంగా ఉంటానని నాకు అనిపించడం లేదు. ఈ నిర్ణయం బాధతో కూడినదే. కానీ, తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది. నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను’ అని హంపి తన పోస్ట్‌లో వెల్లడించింది.
10 వేల యూరోల ఫైన్
హంపి వైదొలగడంతో ఆమె స్థానంలో ఉక్రెయిన్ అమ్మాయి అన్నా ముజిచుక్ క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపికైంది. అయితే.. టోర్నీలో ఆడనందుకు హంపిపై భారీ జరిమానా పడింది. నిబంధనల ప్రకారం టోర్నీని బాయ్‌కాట్ చేసినందుకు ఆమె 10 వేల యూరోల ఫైన్ చెల్లించనుంది. హంపి వైదొలగడంతో ఈ టోర్నీకి ఎంపికైన భారత యువకెరటాలు దివ్య దేశ్‌ముఖ్, ఆర్.వైశాలి పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీ వివాదం.. ఆ మల్టీప్లెక్స్‌లలో ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు నో ఎంట్రీ!
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

