Gukesh | షాక్హాంబర్గ్ (జర్మనీ) : వరల్డ్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్‌కు ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టోర్నీలో షాక్ తగిలింది. వరుసగా రెండో క్వార్టర్స్ మ్యాచ్‌లోనూ అతడు అమెరికా ఆటగాడు ఫాబియానో కరువానా చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుకేశ్.. 18 ఎత్తుల్లో చిత్తయ్యాడు. టైటిల్ పోరు నుంచి నిష్క్రమించిన గుకేశ్.. ఇక చివరి నాలుగు స్థానాల కోసం ఆడనున్నాడు.