సింగపూర్: ప్రతిష్టాత్మక చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. డ్రా ల పర్వం కొనసాగిన ఈ టోర్నీలో వరుసగా ఏడు గేమ్‌ల తర్వాత ఫలితం తేలింది. ఆదివారం ముగిసిన 11వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించి 6 పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చాడు. డిఫెండింగ్ చాంపియన్ లిరెన్ 5 పాయింట్లతో ఉన్నాడు.
గత గేమ్‌ల మాదిరిగా కాకుండా గుకేశ్ ఆదినుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఐదు ఎత్తుల తర్వాతే అతడు మ్యాచ్‌పై పట్టు సాధించాడు. ఆట ఆసాంతం అదే దూకుడును కొనసాగించిన ఈ చెన్నై కుర్రాడు.. 29వ ఎత్తుతో విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో మూడు మ్యాచ్‌లు మిగిలున్న ఈ టోర్నీలో ఇంకో మ్యాచ్ గెలిస్తే చాంపియన్‌షిప్‌ను గుకేశ్ దాదాపు సొంతం చేసుకున్నట్టే!