Mohammed Shami | అహ్మదాబాద్: సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో యువ మీడియం పేసర్ సందీప్ వారియర్‌ను గుజరాత్ టైటాన్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ..ఈ ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ షమీ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన సందీప్‌ను కనీస ధర 50 లక్షలకు గుజరాత్ తీసుకుంది.