DCW vs GGW : మహిళల ప్రీమియర్ లీగ్లో ఉత్కంఠ పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లో గుజరాత్ జెయింట్స్ అద్భుతరీతిలో ఓటమి తప్పించుకుంది. భారీ ఛేదనలో ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కథ ముగిసింది అనుకున్నారంతా. కానీ, నిక్కీ ప్రసాద్(47), స్నేహ్ రానా (29) ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి గుజరాత్ నుంచి విజయాన్ని లాగేసుకున్నంత పని చేశారు. అయితే.. ఆఖరి ఓవర్లో రానాను ఔట్ చేసిన సోఫీ డెవెనె చివరి బంతికి నిక్కీని వెనక్కి పంపడంతో.. 3 పరుగుల తేడాతో గుజరాత్ విక్టరీ కొట్టింది.
డబ్ల్యూపీఎల్లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్. ఈసారి గుజరాత్ జెయింట్స్ స్టార్ సోఫీ డెవిన్ మ్యాచ్ను కాపాడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ల విధ్వంసంతో ఆశలు ఆవిరైన వేళ.. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి జట్టును గెలిపించింది. 20 వ ఓవర్లో స్నేహ్ రానా(29) ఔట్ కావడం.. చివరి బంతికి 4 రన్స్ అవసరమవ్వగా నిక్కీ ప్రసాద్(47) క్యాచ్ ఔట్ కావడంతో 3 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ సమీకరణాలు మారుతు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ .. బేత్ మూనీ(58), అనుష్క శర్మ(39), తనూజా కన్వర్(21 నాటౌట్) మెరుపులతో భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో శ్రీ చరణి(4-31) రాణించింది.
𝗦𝗼𝗽𝗵𝗶𝗲 𝗖𝗹𝘂𝘁𝗰𝗵 𝗗𝗲𝘃𝗶𝗻𝗲! 🫡
🎥 She is ice cool under pressure yet again to help @Giant_Cricket clinch a thriller 🧊
Scorecard ▶️ https://t.co/73Ec3xR5A6 #TATAWPL | #KhelEmotionKa | #GGvDC pic.twitter.com/kbdAKnUaKP
— Women’s Premier League (WPL) (@wplt20) January 27, 2026