IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ రీటెన్షన్ గడవుకు ముందే ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సంజూ శాంసన్ ట్రేడింగ్ డీల్ ఇంకా కొలిక్కి రాలేదు. కానీ, చకచకా పావులు కదిపిన ముంబై ఇండియన్స్ ఒక్కరోజే ఇద్దరు మ్యాచ్ విన్నర్లను పట్టేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి శార్ధూల్ ఠాకూర్‌ను రూ.2 కోట్లకు సొంతం చేసుకున్న ముంబై.. గుజరాత్ నుంచి విధ్వంసక హిట్టర్ షెర్ఫానే రూథర్ఫొర్డ్ను కొనేసింది. 2020లో ముంబై స్క్వాడ్‌లో భాగమైన ఈ కరీబియన్ ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ ఫ్రాంచైజీ తరఫున ఆడబోతున్నాడు.
పొట్టి క్రికెట్ సంచలనాల్లో ఒకడైన షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్‌లోనూ సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడాడు. 18వ సీజన్లో అతడు గుజరాత్ టైటాన్స్ విజయాల్లో కీలకమ య్యాడు. అయినా సరే పంతొమ్మిదో సీజన్‌కు అతడిని గుజరాత్ వద్దనుకుంది. దాంతో, రంగంలోకి దిగిన ముంబై.. ఈ పవర్ హిట్టర్‌ను రూ.2.6కోట్లకు కొన్నది. ఇప్పటివరకూ 44 టీ20లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడాడు.
📰 𝗦𝗛𝗘𝗥𝗙𝗔𝗡𝗘 𝗥𝗨𝗧𝗛𝗘𝗥𝗙𝗢𝗥𝗗 𝗝𝗢𝗜𝗡𝗦 𝗠𝗨𝗠𝗕𝗔𝗜 𝗜𝗡𝗗𝗜𝗔𝗡𝗦
Read more 👉 https://t.co/13g4GNOoRY pic.twitter.com/cKqUu5zlbT
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
ఐదేళ్ల క్రితం (2020)లో ఈ చిచ్చరపిడుగును కొన్న ముంబై.. ఒక్క మ్యాచ్ ఆడించలేదు. మరి.. ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఇప్పటివరకూ ఐపీఎల్లో 23 మ్యాచ్‌లే ఆడిన అతడు.. మెరుపు బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. బంతిని బలంగా బాదే ఈ విండీస్ వీరుడు.. ఈ మెగా లీగ్‌లో 137.37 స్ట్రయిక్ రేటుతో 397 రన్స్ సాధించాడు. దూకుడే మంత్రగా డెత్ ఓవరల్లో దంచేసే అతడు ఐపీఎల్లో 25 ఫోర్లు, 26 సిక్సర్లు బాదాడు.
𝐓𝐑𝐀𝐃𝐄 ⬅️ 𝐈𝐍
Get ready for ℝ𝕌𝕋ℍ𝔼ℝ𝔽𝕆ℝ𝔻 ची तोडफोड. Glad to have you 🔙 in the Blue & Gold, Sherfane! 💙💥 pic.twitter.com/DZHMQqO2TO
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
ఐపీఎల్ అనుభవజ్ఞుడైన శార్దూల్ ఠాకూర్(Shardul Thakur)ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.2 కోట్లకు కొనేసింది ముంబై. ప్రధాన పేసర్ దీపక్ చాహర్ గాయపడిన విషయం తెలిసిందే. అతడి స్థానాన్ని శార్దూల్ భర్తీ చేయనున్నాడు. ఐపీఎల్లో మరో ప్లేయర్కులేని రికార్డు శార్ధూల్ ఠాకూర్‌కు ఉంది. ఈ పేస్ ఆల్‌రౌండర్ ఇప్పటివరకూ మూడు సార్లు వేలానికి వెళ్లకుండానే అమ్ముడయ్యాడు. 2017లో కింగ్స్ లెవన్ పంజాబ్ నుంచి అతడిని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తీసుకుంది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకోవడంతో శార్దూల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు లక్నో నుంచి రూ.2 కోట్లకు ముంబై అతడిని కొనుగోలు చేసింది.
📰 𝗦𝗛𝗔𝗥𝗗𝗨𝗟 𝗧𝗛𝗔𝗞𝗨𝗥 𝗝𝗢𝗜𝗡𝗦 𝗠𝗨𝗠𝗕𝗔𝗜 𝗜𝗡𝗗𝗜𝗔𝗡𝗦 𝗔𝗛𝗘𝗔𝗗 𝗢𝗙 𝗜𝗣𝗟 𝟮𝟬𝟮𝟲
Read more 👉 https://t.co/bwcjR4dDQs pic.twitter.com/NjvmKRA3NZ
— Mumbai Indians (@mipaltan) November 13, 2025