ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత గంభీర్‌కు జీమెయిల్లో ‘ఐసిస్ కాశ్మీర్’ అనే ఐడీ నుంచి ‘ఐ కిల్ యూ’ అని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుజరాత్‌కు చెందిన జిగ్నేశ్ సిన్హ్ పర్మార్‌గా గుర్తించారు. 21 ఏండ్ల జిగ్నేశ్.. ఇంజినీరింగ్ చదువుతున్నాడు.