ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వాల్వర్ట్ (57), గార్డ్నర్ (51 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. హర్లీన్ (31) సత్తాచాటింది. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. మరినె కాప్ (36) టాప్ స్కోరర్ కాగా.. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (25) ఆఖరి వరకు పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు.