DC vs GG : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants)కు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మరిజానే కాప్ (marizanne kapp) దెబ్బకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆమె తన రెండో ఓవర్ మూడో బంతికి అష్ గార్డ్నర్ను ఎల్బీగా ఔట్ చేసింది. రెండో బంతికి లారా వొల్వార్డ్త్(1)ను బౌల్డ్ చేసింది. దాంతో, 9 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. గార్డ్నర్ను వెనక్కి పంపింది. హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (1) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోర్.. 14/3. అంతకుముందు ఖాతా తెరవక ముందే ఆ జట్టు వికెట్ పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ సబ్బినేని మేఘన (1) ఔట్ అయింది. మరిజానే కాప్ ఓవర్లో రెండో బంతికి బౌల్డ్ అయింది.
మహిళల ప్రీమియర్ లీగ్లో ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ జట్లు డీవై పాటిల్ స్టేడియంలో తలపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచిన గుజరాత్ విజయ పరంపరను కొనసాగించాలి అనుకుంటోంది. గత మ్యాచ్లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.