GGW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న బెంగళూరు.. రెండో దఫాకూడా గుజరాత్ జెయింట్స్‌ను బెంబేలెత్తించింది. 178 పరుగుల ఛేదనలో సయాలీ సత్ఘరే(21 -3) విజృంభణతో గుజరాత్ టాపార్డర్ కుప్పకూలింది. ప్రధాన బ్యాటర్లు విఫలమవ్వడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 117కే పరిమితమైంది. 61 పరుగుల తేడాతో జయభేరి మోగించిన మంధాన బృందం దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. టాప్ గేర్ ఆటతో ప్రత్యర్ధులను వణికిస్తున్న ఆర్సీబీ ఐదో విక్టరీతో ప్లే ఆఫ్స్ చేరింది. ఈ సీజన్లోనాకౌట్ దశకు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. సోమవారం వడోదరలో గౌతమీ నాయక్(73) అర్ధ శతకంతో 178 రన్స్ చేసిన బెంగళూరు.. మరోసారి గుజరాత్‌ను చిత్తుగా ఓడించింది. భారీ ఛేదనకు దిగిన గుజరాత్‌కు షాకిస్తూ ఓపెనర్ బేత్ మూనీ(3)ని బౌల్డ్ చేసిన సయాలీ సత్కరే(2-16).. ఐదో బంతికి సోఫీ డెవినె(0)ను వెనక్కి పంపింది.
Emphatic and 𝙥𝙡𝙖𝙮𝙤𝙛𝙛𝙨 𝙗𝙤𝙪𝙣𝙙! ❤️
Congratulations to 2⃣0⃣2⃣4⃣ #TATAWPL champions @RCBTweets on becoming the first team to reach the playoffs 👏🔝#KhelEmotionKa | #GGvRCB pic.twitter.com/QOH99joDQ5
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026
ఆ తర్వాతి ఓవర్లో కనికా ఆహుజా(0)ను లారెన్ బెల్ డకౌట్‌గా పెవిలియన్ పంపింది. దాంతో.. 5 పరుగులకే గుజరాత్ మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది. అనుష్క శర్మ(18) సైతం విఫలమైంది. కెప్టెన్ అష్లీ గార్డ్నర్(54) అర్ధ శతకంతో పోరాడినా.. ఆమెకు తోటి బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. గుజరాత్ బ్యాటర్లు తోకముడిచారు. దాంతో.. గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 117కే పరిమితమైంది.
Double-wicket 1⃣st over v #DC ✅
Double-wicket 1⃣st over tonight 🔥Sayali Satghare is making it a habit 👏
Updates ▶️ https://t.co/KAjH515c64 #TATAWPL | #KhelEmotionKa | #GGvRCB | @RCBTweets pic.twitter.com/37C0C4wM35
— Women’s Premier League (WPL) (@wplt20) January 19, 2026
టాస్ ఓడిన ఆర్సీబీకి షాకిస్తూ గుజరాత్ జెయింట్స్ బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసినా ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే డేంజరస్ జార్జియా వోల్(1)ను కష్వీ గౌతమ్ క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. పరుగులకే ఆర్సీబీ విధ్వంసక ప్లేయర్లు డగౌట్ చేరారు. అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన(26), గౌతమీ నాయక్(73) లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. మంధానను ఎల్బీగా ఔట్ చేసిన గార్డ్నర్ ఈ ఈ జోడీని గార్డ్నర్ విడదీసింది.
ఆ తర్వాత రీచా ఘోష్(27) జతగా ఆర్సీబీ స్కోర్ బోర్డును నడిపించిన గౌతమి హాఫ్ సెంచరీ సాధించింది. కాసేపటికే రీచా పెద్ద షాట్ ఆడబోయి బౌండరీ వద్ద గార్డ్నర్ చేతికి క్యాచ్ ఇచ్చింది. అనంతరం రాధా యాదవ్(17) డెవినె ఓవర్లో భారీ సిక్సర్‌తో స్కోర్ 160 దాటింది. కష్వీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతినే కవర్స్‌లో రాధ బౌండరీకి పంపింది. రెండో బంతికి ఫోర్ బాదిన తను ఔటయ్యాక వచ్చిన శ్రేయాంక పాటిల్(8 నాటౌట్) స్వీప్ షాట్‌తో ఫోర్ సాధించగా 17 రన్స్ వచ్చాయి. ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 కొట్టింది.