గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఆరంభంలోనే కేన్ విలియమ్సన్ (5), రాహుల్ త్రిపాఠీ (16) వికెట్లు కోల్పోయినప్పటికీ.. అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు.
అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం తగ్గకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ కోల్పోయిన రెండు వికెట్లూ షమీనే తీయడం గమనార్హం.