సన్‌రైజర్స్ యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ మరో వికెట్ తీశాడు. బ్యాటుతో అదరగొడుతున్న వృద్ధిమాన్ సాహా (68)ను పెవిలియన్ చేర్చాడు. గంటకు 152 కిలోమీటర్ల వేగంతో అతను వేసిన బంతికి సాహా రియాక్ట్ అయ్యేలోపే వికెట్లను పడగొట్టిందా బంతి. దీంతో సాహా నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. గుజరాత్‌కు అద్భుతమైన ఆరంభం అందించిన సాహా.. కేవలం 38 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 68 పరుగులు చేశాడు. సాహా అవుటవడంతో తెవాటియా క్రీజులోకి వచ్చాడు.