యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటాడు. గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (22)ను అవుట్ చేసి సన్‌రైజర్స్‌కు తొలి బ్రేక్ ఇచ్చిన అతను.. తన రెండో ఓవర్లోనే కీలకమైన హార్దిక్ పాండ్యా (10)ను పెవిలియన్ చేర్చాడు. పదో ఓవర్ తొలి బంతికి పాండ్యా కొట్టిన షాట్.. షార్ట్ మిడాన్‌లో ఉన్న భువనేశ్వర్‌కు కొద్ది దూరంలో కింద పడి బౌండరీకి దూసుకుపోయింది.
దీంతో తర్వాతి బంతిని షార్ట్‌బాల్ వేసిన ఉమ్రాన్.. హార్దిక్‌ను బోల్తా కొట్టించాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచి వికెట్ కీపర్ మీదుగా వెనక్కు వెళ్లింది. థర్డ్ మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్కో జాన్సెన్ వేగంగా వచ్చి దాన్ని అందుకోవడంతో పాండ్యా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.