రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (35) అనవసర పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతిని లాంగాన్ వైపు కొట్టిన గిల్.. రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే బంతి అంత దూరం వెళ్లకపోవడం, ఫీల్డర్ వేగంగా బంతిని చేరుకోవడం చూసిన మాథ్యూ వేడ్ రెండో పరుగు కోసం రాలేదు.
అయితే రెండో పరుగు తీయాలనే ఉద్దేశ్యంతో సగం పిచ్ వరకూ వచ్చేసిన గిల్ సరైన సమయంలో వెనుతిరగలేకపోయాడు. దాంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.