రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గుజరాత్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0) డకౌట్ అయ్యాడు. బౌల్ట్ వేసిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన సాహా విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శాంసన్ సులభంగా అందుకున్నాడు. దీంతో ఖాతా తెరవకుండానే సాహా పెవిలియన్ చేరాడు. సాహా అవుటవడంతో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ క్రీజులోకి వచ్చాడు.