బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. పాండ్యా (3) అవుటైన కాసేపటికే.. క్రీజులో నిలదొక్కుకున్న సాయి సుదర్శన్ (20) కూడా పెవిలియన్ చేరాడు. హసరంగ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి అతను అవుటయ్యాడు. హసరంగ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి సాయి సుదర్శన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. సబ్స్టిట్యూట్ కీపర్ అనూజ్ రావత్ ప్యాడ్లను తాకి గాల్లోకి ఎగిరింది. వెంటనే వెనక్కు తిరిగిన అనూజ్.. బంతి నేలను తాకడానికి ముందే క్యాచ్ పట్టేశాడు. దాంతో బెంగళూరు శిబిరం సంబరాల్లో మునిగిపోయింది.