ముంబై జోరుకు గుజరాత్ బౌలర్లు కళ్లెం వేశారు. పవర్‌ప్లే ముగిసిన కాసేపటికే రోహిత్ (43)ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు నిలబడిన సూర్యకుమార్ యాదవ్ (13)ను సంగ్వాన్ అవుట్ చేశాడు. సంగ్వాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్య.. మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చాడు.
తర్వాతి ఓవర్లోనే కుదురుకున్న ఇషాన్ కిషన్ (45) కూడా అవుటయ్యాడు. అల్జారీ జోసెఫ్ వేసిన బంతిని ఇషాన్ కూడా నేరుగా మిడ్వికెట్లో ఉన్న రషీద్ ఖాన్‌కు కొట్టాడు. దాన్ని అతను పట్టేయడంతో ఇషాన్ వెనుతిరిగాడు. దీంతో 111 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ముంబై తడబడింది. ప్రస్తుతం తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్ క్రీజులో ఉన్నారు.