Pitch Drying Methods : క్రికెట్లో ఆటగాళ్ల ఫామ్ మాత్రమే కాదు వాతావరణం(Weather) కూడా మ్యాచ్ ఫలితంలో చాలా కీలకం. వర్షం పడిందంటే చాలు ఒక్కసారిగా గేమ్ మారిపోతుంది. అయితే.. ఒకప్పుడు కీలక మ్యాచ్‌ల సమయంలో చినకు పడితే ఇక అంతే. మ్యాచ్ రద్దు లేదంటే రిజర్వ్ డే(Reserve Day)న నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ.. ప్రస్తుతం భారీ వాన కురిసినా సరే అర గంటలోపే గ్రౌండ్‌మెన్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆసియా కప్(Asia Cup 2023)లో రిజర్వ్ డేన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో పిచ్‌ను అరబెట్టేందుకు హాలోజెన్ లైట్స్(Halogen Lights) వాడారు. గతంలో ఏకంగా హెలికాప్టర్లు(Helicaptors) వాడిన సందర్భాలు ఉన్నాయి. అవును.. ఆ విశేషాలు చదివేయండి.
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్‌కు వర్షం అంతరాయి కలిగించింది. దాంతో, మ్యాచ్‌ను సెప్టెంబర్ 11 రిజర్వ్ డేన నిర్వహించారు. అయితే.. ఆ రోజు కూడా వాన పడింది. దాంతో మ్యాచ్ జరగదు అనుకున్నారంతా. కానీ, చినుకుల తగ్గాక గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు
హాలోజెన్ లైట్స్ వాడుతున్న దృశ్యం
సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. పిచ్‌ను ఆరబెట్టడానికి హాలోజెన్ లైట్స్(Halogen Lights) వాడారు. దాంతో, గంటన్నర తర్వాత మ్యాచ్ మొదలైంది. విరాట్ కోహ్లీ(122 నాటౌట్) కేఎల్ రాహుల్(111 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కిన ఈ పోరులో భారత్ 228 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు యాషెస్ సిరీస్(Ashes Series) అంటే ‘మినీ ప్రపంచ కప్’ లాంటిది. రసవత్తరంగా జరిగే ఆ సిరీస్‌లో వర్షం అంతరాయం కలిగిస్తే అందరూ నిరాశ పడతారు. అందుకని గ్రౌండ్ సిబ్బంది క్షణాల్లో పిచ్‌ను రెడీ చేస్తారు. 2017-18లో యాషెస్ సిరీస్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.
హెయిర్ డ్రయ్యర్‌తో పిచ్‌ను ఆరబెడుతున్న దృశ్యం
ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియంలో ఆఖరి రోజు వాన మొదలైంది. చినుకులు ఆగాక గ్రౌండ్ సిబ్బంది హెయిర్ డ్రయ్యర్ల(Hair Dryer) సాయంతో పిచ్‌ను ఆరబెట్టారు. ఆ తర్వాత యథావిధిగా మ్యాచ్ ప్రారంభం అయింది. ఇందులో ఆతిథ్య కంగారు జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది.
అది 2003 వరల్డ్ కప్. ఆస్ట్రేలియా(Australia), నెదర్లాండ్స్(Netherlands) మ్యాచ్ జరుగుతుండగా వాన పడింది. అయితే.. కాసేపటికి వరణుడు శాంతించాడు. అభిమానులంతా మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే ఆసక్తితో ఉన్నారు.
హెలికాప్టర్‌తో ఆరబెడుతున్న దృశ్యం
ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది పిచ్, ఔట్ ఫీల్డ్(Out Field)ను త్వరగా ఆరబెట్టేందుకు ఏకంగా హెలికాప్టర్ల (Helicaptors)నే ఉపయోగించారు.ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత జట్టు 2016లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఇరు జట్ల మధ్య క్వీన్స్ పార్క్ ఓవల్ స్టేడియం()లో జరిగిన టెస్టు మ్యాచ్ జరుగుతుండగా వర్షం పడింది. కాసేపటికి చినుకులు తగ్గాయి. కానీ, ఔట్‌ఫీల్డ్ సమీపంలోని నీళ్లు పేరుకుపోయాయి.
ఔట్ ఫీల్డ్‌లో చిన్న చిన్న రంధ్రాలు చేస్తున్న దృశ్యం
దాంతో, ఆ నీటిని తొలగించేందుకు గ్రౌండ్ సిబ్బంది అక్కడక్కడా చిన్న చిన్న రంధ్రాలు(Small Holes) చేశారు. దాంతో, గాలి, వెలుతురు తగిలి ఔట్‌ఫీల్డ్ తొందరగా ఆరింది.
భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య 2007 వన్డే సిరీస్ జరిగింది. కొచ్చిలోని నెహ్రూ స్టేడియం(Nehru Stadium)లో పిచ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది ఏం చేశారంటే..? బౌలర్స్ రనప్ ప్రదేశంలో బొగ్గుల పొయ్యి పెట్టారు.
బొగ్గుల పొయ్యితో ఆరబెడుతున్న దృశ్యం
బొగ్గుల వేడితో పిచ్ మీది తేమ(Moitstures) పోయింది. ఆ కాసేపటికి మ్యాచ్ మొదలైంది. ఈ గేమ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించింది.
భారత్, ఆసీస్ మధ్య 2017లో హైదరాబాద్ వేదికగా టీ20 మ్యాచ్ జరిగింది. అయితే.. భారీ వర్షం కారణంగా ఉప్పల్(Uppal)లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో నీరు చేరింది. ఔట్ ఫీల్డ్(Out Field) తడిగా మారింది.
టేబుల్ ఫ్యాన్లతో ఆరబెడుతున్న దృశ్యం
దాంతో, గ్రౌండ్ సిబ్బంది కొన్ని చోట్ల టేబుల్ ఫ్యాన్ల(Table Fans)ను పెట్టారు. ఆ తర్వాత మ్యాచ్ యథావిధిగా మొదలైంది. ఇవేకాకుండా కొన్నిసార్లు ఐరన్ బాక్స్(Iron Box)లతో కూడా పిచ్‌ను ఆరబెట్టిన సందర్బాలు ఉన్నాయి.