చెన్నై: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న పద్నాలుగేండ్ల చిచ్చర పిడుగు భరత్ సుబ్రమణ్యం.. గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న టోర్నీలో మూడో నార్మ్‌ను ఖాతాలో వేసుకున్న భరత్.. మన దేశం నుంచి ఈ ఘనత సాధించిన 73వ ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నైకి చెందిన భరత్ తాజా టోర్నీలో 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 2,500 ఎలో రేటింగ్ మార్క్‌ను చేరుకున్న భరత్ గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకోగా.. 7 పాయింట్లు సాధించిన మరో భారత ప్లేయర్ లలిత్ బాబు విజేతగా నిలిచాడు.