విజ్క్ ఆన్ జి: నెదర్లాండ్స్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మూడు రౌండ్ల తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయాడు. 13 రౌండ్లుగా సాగే ఈ టోర్నీలో మూడు రౌండ్ల దాకా సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్న అతడు.. అనిష్ గిరి (నెదర్లాండ్స్)తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్నూ డ్రా చేసుకున్నాడు.
కానీ నీమన్ (యూఎస్), నొదిర్బెక్ (ఉజ్బెకిస్థాన్) తమ ప్రత్యర్థులను ఓడించడంతో ఆ ఇద్దరూ చెరో 3 పాయింట్లతో తొలి స్థానానికి దూసుకెళ్లారు. 2.5 పాయింట్లతో అర్జున్ రెండో స్థానంలో ఉన్నాడు. గుకేశ్, ప్రజ్ఞానంద మధ్య జరిగిన గేమ్ కూడా డ్రాగా ముగిసింది.