లక్నో: ఐపీఎల్(IPL 2025) నుంచి కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ దూరం అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న అతను గాయం వల్ల .. టోర్నీ నుంచి అతన్ని తప్పించారు. దీంతో గుజరాత్ జట్టకు తీవ్ర దెబ్బ తగిలింది. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. అతని గజ్జల్లో గాయమైనట్లు మెడికల్ సిబ్బంది తెలిపారు. దీంతో అతను న్యూజిలాండ్‌కు పయనమై వెళ్లాడు.
ఇక ఇవాళ లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన లక్నో సూపర్ గెయింట్స్ జట్టు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో మిషెల్ మార్ష్ ఆడడం లేదని లక్నో కెప్టెన్ పంత్ తెలిపారు. మార్ష్ కూతురు ఆరోగ్యం సరిగా లేదని, ఆ చిన్నారిని చూసుకునేందుకు అతను మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు. మిచెల్ మార్ష్ స్థానంలో ఢిల్లీ బ్యాటర్ హిమ్మత్ సింగ్ జట్టులోకి వచ్చినట్లు చెప్పాడు.
🚨 Toss 🚨@LucknowIPL elected to field against @gujarat_titans
Updates ▶️ https://t.co/VILHBLEerV #TATAIPL | #LSGvGT pic.twitter.com/F8T97VJ5Mv
— IndianPremierLeague (@IPL) April 12, 2025