Sara Ali Khan: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రేమ కథలో కొత్త ‘సారా’ వచ్చి చేరింది. ఈ పంజాబీ కుర్రాడు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నాడని, మధ్యలో విభేదాలు వచ్చినా ఇటీవల కాలంలో అవి కూడా సమసిపోయాయని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సారాతో బ్రేకప్ అయినప్పుడు గిల్.. బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌తో ప్రేమలో ఉన్నట్టు బీటౌన్ కోడై కూసింది. అయితే తాజాగా సారా అలీ ఖాన్.. తాను గిల్‌తో డేటింగ్ చేయలేదని చెప్పడమే గాక ఆమె మరో సారా అని చెప్పడంతో అభిమానుల్లో ఆ మూడో సారా ఎవరన్న ఆసక్తి నెలకొంది.
తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. ‘నేను గిల్‌తో డేటింగ్ చేయలేదు. ఆ సారా వేరు..’ అని తెలిపింది. గిల్ – సారాలు డేటింగ్లో ఉన్నారని తెలియడంతో అందరూ తన గురించే అనుకున్నారని కానీ అది తాను కాదని ఈ బాలీవుడ్ బ్యూటీ స్పష్టం చేసింది.
Finally SARA ka SARA confusion clear ho gya 🤌💜
Thanks #SaraAliKhan for this #ShubmanGill #SaraTendulkar pic.twitter.com/iHuNtsJ8rn— Simping over ‘SHUBMAN’💀💜 (@crushxshraddha) November 6, 2023
సచిన్ కూతురితో గిల్ డేటింగ్ లో ఉన్నాడని గడిచిన రెండేండ్లుగా రూమర్లు వస్తున్నాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరి పోస్టును ఒకరు లైక్ చేసుకోవడంతో పాటు ప్రైవేట్ పార్టీలలో కలిసినప్పుడు క్లోజ్‌గా మూవ్ అవడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేనన్న చర్చ నడిచింది. మధ్యలో విడిపోయి.. మళ్లీ ఇటీవలే కలిశారని వార్తలు వచ్చాయి. తాజాగా వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సారా హాజరుకావడం.. గిల్ సెంచరీ మిస్ కాగానే ఆమె నిరాశచెందడానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మళ్లీ వీళ్ల మధ్య ప్రేమ చిగురించిందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అటు గిల్ గానీ, ఇటు సారా గానీ తమ ప్రేమ, బ్రేకప్‌పై ఎటువంటి ప్రకటనా చేయలేదు. సైఫ్ కూతురు చేసిన ఈ కామెంట్స్‌తో గిల్ ప్రేమించిన సారా ఎవరబ్బా అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.