IPL 2023 : సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(101 : 58 బంతుల్లో 13 ఫోర్లు, ఒకసిక్స్)సెంచరీ బాదాడు. అచ్చొచ్చిన అహ్మదాబాద్ స్టేడియంలో చెలరేగిన గిల్ ఐపీఎల్ శతకం నమోదు చేశాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(47) రాణించాడు. రెండో వికెట్‌కు 147 పరుగులు జోడిచినా కూడా పాండ్యా సేన భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(0)ను భువనేశ్వర్ డకౌట్ చేశాడు. హార్దిక్ పాండ్యా (8) రాహుల్ తెవాటియా(3) డేంజరస్ డేవిడ్ మిల్లర్(7) ఇలా వచ్చి అలా డగౌట్‌కు వెళ్లారు.
భువనేశ్వర్ వేసిన 20వ ఓవర్లో గుజరాత్ 4 వికెట్లు పడ్డాయి. తొలి బంతికి సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్(101) ఔటయ్యాడు. రెండో బంతికి రషీద్ ఖాన్ వెనుదిరిగాడు. హ్యాట్రిక్ బాల్‌కు నూర్ అహ్మద్ రనౌటయ్యాడు. నాలుగో బంతికి షమీ ఔటయ్యాడు. ఆఖరి బంతికి మోహిత్ శర్మ సింగిల్ తీయడంతో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది.
𝙈𝘼𝙄𝘿𝙀𝙉 𝙄𝙋𝙇 𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔! 💯
A magnificent TON comes up for @ShubmanGill 👏🏻👏🏻 #TATAIPL | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/YZHhiw8RkN
— IndianPremierLeague (@IPL) May 15, 2023